జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ చనిపోయాడని సోషల్ మీడియాలో వార్తల ప్రచారం సాగుతోంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల భవల్పూర్ మసీదుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు మసూద్ పై బాంబు దాడి చేశారని ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనలో మసూద్ మరణించాడనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై పాక్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. భారత్ మసూద్ ను మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది.