మరణించిన అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం పువ్వుల్లో పెట్టి ఇస్తానని, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బాధితులకు న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని సిపిఎం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఆ హామీ వైసీపీ ప్రభుత్వానికి గుర్తుందా లేదా? అని ప్రశ్నించారు. ఏ వేదిక మీద హామీ ఇచ్చారో ఆ వేదికపై బుధవారం నుంచి 30 గంటలపాటు నిరసన దీక్ష చేపడుతామని అన్నారు. 3,4 తేదీల్లో జరిగే నిరసన దీక్షకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారని ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు.