ప్రముఖ పర్యాటక కేంద్రం వంజంగి మేఘాల కొండ సందర్శనను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పర్యాటకులు అధిక సంఖ్యలో రావడంతో చెత్త పేరుకపోయింది.
దీంతో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో మంగళవారం నుంచి వారం రోజుల పాటు సందర్శనను నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య పనుల అనంతరం అనుమతిస్తామన్నారు.