ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకాలకు అర్హత ఉండి పేమెంట్ ఫెయిల్ అయిన వారికి, గ్రీవెన్స్ క్లియర్ అయి కొత్తగా నవరత్నాలకు
అర్హత పొందిన వారికి జనవరి 5న ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. వీటితో పాటు కొత్తగా మంజూరైన పెన్షన్లు, బియ్యం, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను కూడా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.