భూ యాజమాన్య హక్కు చట్టంపై ఏపీ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్రింద కోర్ట్‌లు స్థిరాస్తి దావాలను వెంటనే స్వీకరించాలని ఆదేశించింది. భూ యాజమాన్య హక్కు చట్టంపై ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, బార్ కౌన్సిల్, కర్నూల్ బార్ అసోసియేషన్ వేసిన పిల్స్‌పై బుధవారం హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ చట్టంపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరపున సుంకర రాజేంద్ర ప్రసాద్ పిల్ వేశారు. విచారణలో భాగంగా ఈ చట్టంలో సెక్షన్ 4 క్రింద నోటిఫికేషన్ జారీ చేయలేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. రూల్స్ కూడా తాము ఫ్రేమ్ చేయలేదన్నారు. తగిన అధికారులను కూడా నియమించలేదని ఏజీ వెల్లడించారు. వాదనలు విన్న హైకోర్టు... భూయాజమాన్య హక్కు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే స్థిరాస్తి దావాలన్నింటిని స్వీకరించాలని క్రింద కోర్టులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఫిబ్రవరి ఒకటికి వాయిదా వేసింది.