పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా జరుగుతున్న గన్స్, డ్రగ్స్ స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. దీనికోసం డ్రోన్లను అడ్డుకునేందుకు స్వదేశీ సాంకేతికతతో తయారైన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తున్నామని త్వరలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మరో 6 నెలల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు.