మరికొద్ది సేపట్లోనే షర్మిల గన్నవరం ఎయిర్ పోర్ట్కు రానున్నారు. నిన్న ఇడుపులపాయకు చేరుకున్న షర్మిల తన తండ్రి, దివంగత నేత వైఎస్సార్ సమాధిని సందర్శించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో షర్మిల ఇడుపులపాయకు వచ్చారు. ఈ సందర్భంగా కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాత్రి ఇడుపులపాయలోనే బస చేసిన షర్మిల ఈరోజు విజయవాడకు రానున్నారు. కాగా.. నేటి సాయంత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల భేటీ కానున్నారనే వార్త ఏపీలో సంచలనం రేపుతోంది. వీరిద్దరి భేటిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. షర్మిళకు సాయంత్రం 4 గంటల కు కలిసేందుకు జగన్ సమయమిచ్చారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.