పేపర్ లీకేజీలు, పోటీ పరీక్షల్లో కాపీ కొట్టడం వంటి కేసులను విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బుధవారం తెలిపారు. నాగౌర్‌లోని ఖిన్యాలలో 'విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఏ దోషిని క్షమించబోమన్నారు. రాష్ట్ర ప్రజలకు భయాందోళనలు లేని వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి అన్నారు. ఇందుకోసం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గ్యాంగ్‌స్టర్లు, సంస్థాగత నేరగాళ్లపై యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని శర్మ అన్నారు.కేంద్రం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను 100 శాతం లబ్ధిదారులకు అందించడమే యాత్ర లక్ష్యమని ముఖ్యమంత్రి చెప్పారు.