నంద్యాల పురపాలక సంఘంలో ఒప్పంద, పొరుగు సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణయ్య, భాస్కరాచారి హెచ్చరించారు. నంద్యాల పురపాలక కార్యలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో బుధ వారం వారు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే అడు గుతున్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa