మహిళా విద్యకు ఆధ్యురాలిగా సావిత్రిభాయి పూలే నిలుస్తారని విశాఖలోని ఏయూ ఇంచార్జి వీసీ ఆచార్య సమత అన్నారు. ఏయూ డాక్టర్ దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో సావిత్రిభాయి
ఫూలే జయంతిని పురస్కరించుకుని బుధవారం ఏయూ పరిపాలనా భవనలో కార్యక్రమం నిర్వహించారు. ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సావిత్రిభాయి పూలే చిత్రపటానికి ఇంచార్జి వీసీ ఆచార్య సమత పూలమాల వేసి అంజలి ఘటించారు.