అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు అని యూఎస్ క్యాపిట్ దాడి కేసులో కొలరాడో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
దానిని రద్దుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ట్రంప్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కొలరాడో కోర్టు ఉత్తర్వులను అమలుచేస్తే అధ్యక్ష పదవి రేసులో ముందంజలో ఉన్న అభ్యర్థికి ప్రజలు ఓట్లేయకుండా చేసినట్లవుతుందని, ఇది అమెరికా చరిత్రలోనే తొలిసారని పేర్కొన్నారు.