40 సంవత్సరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమి ఇవ్వాలని దౌర్జన్యం చేయడం తగదని యేకుల రామచంద్రా రెడ్డి బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దవటం మండలంలోని మందపల్లి సర్వే నెంబర్ 32, 33, 34 లోని 1. 70 ఎకరాలు భూమిని గత 40 సంవత్సరాల నుంచి పసుపు, అరటి, వరి పంటలు సాగు చేశామన్నారు. దాసరి సుబ్బలక్షుమ్మ, దాసరి అనుపుల్లయ్య లు తమపైకి దౌర్జన్యం చేస్తున్నారన్నరన్నారు. సిద్దవటం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.