ఏపీ అసెంబ్లీ స్పీకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉండటంతో గురువారం రాత్రి శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి.. స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి డిశ్ఛార్జి చేస్తామని చెప్పారు.