తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన ఆళ్లగడ్డలో నిర్వహించే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆళ్లగడ్డలో జిల్లా నేతలతో కలిసి సమావేశమై చర్చించారు. లక్ష మందితో చేపట్టే ఈ సభను జిల్లా నలుమూలల నుంచి శ్రేణులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.