నెల్లూరు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.