టీటీడీలోని పలు ట్రస్టులకు శుక్రవారం రూ. 40 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన కెవి రాజశేఖర్ కు చెందిన జెకెసి ప్రాజెక్ట్సు లిమిటెడ్ సంస్థ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ. 10 లక్షలు, కొల్లి గోపాలకృష్ణ అన్నదానం ట్రస్టుకు రూ. 10 లక్షలు, కొల్లి మాధవ అన్నదానం ట్రస్టుకు రూ. 10 లక్షలు, ఢిల్లీకి చెందిన శివంగ్ కౌర్ బర్డ్ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు.