వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..... ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న పాలనలో మనమంతా ఎంతో లబ్దిపొందాం. సంక్షేమపథకాలు మన ఆర్థికస్థాయిని పెంచాయి. జగనన్న సామాజిక సాధికారత బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల తలరాతలే మార్చింది. డిప్యూటీసీఎంలతో సహా మంత్రుల్ని, ఎంపీ, ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల ఛైర్మన్లను చేసింది.చంద్రబాబు పాలనలో అన్నీమోసాలే. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టడమే. ప్రజలను మభ్యపెట్టి, ఓట్లేయించుకుని, అవసరం తీరాక వదిలేసేవాడు చంద్రబాబు. జగనన్న ఉంటేనే మన బతుకుల బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బావుంటుంది అని అన్నారు.