బీసీలను బానిస వర్గాలుగా చూసిన పెత్తందార్లు చంద్రబాబు అండ్ కో..! అని రాష్ట్ర బీసీ సంక్షేమం,సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక న్యాయం పదాలకు అర్ధం, పరమార్ధం చెప్పింది వైయస్ జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. గతంలో ఈ వర్గాల వారిని టీడీపీ వారు బానిసలుగా చూశారు. సమాజంలో బీసీలను బాధిత వర్గాలుగా మార్చారు. బలహీన వర్గాలు బాధలో ఉంటేనే పెత్తందార్ల ముందు సాగిలపడి, వారు చెప్పినట్లు వింటారు అన్నది వారి నమ్మకం అంటూ ధ్వజమెత్తారు.