వైసీపి తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.... బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు స్థానిక సంస్థల్లోను, శాసనసభ,శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభల్లో పదవులిచ్చి...వారి రాజకీయ స్థాయిని పెంచారు జగనన్న. అంతేకాదు వారి ఆత్మగౌరవాన్ని పెంచారు. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి విండ్‌పవర్; సోలార్ పవర్‌లకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటుతో ఇక్కడ అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఓర్వగల్లు ప్రాజెక్టులను నిలబెట్టాం. అవుకు రిజర్వాయర్‌కు కూడా నీళ్లిచ్చే స్థాయికి వచ్చాం. ప్రజలకు మరీ ముఖ్యంగా పేదప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న మహానేత వైయస్సార్. ఆ తపన ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిలో కనిపిస్తోంది.రూ.25లక్షల వరకు వైద్యసేవలందించే స్థాయికి ఆరోగ్యశ్రీని పెంచిన జగనన్న..పేదలకు గొప్పవరమే అందించారు. ఇచ్చిన మాటపై నిలబడటం జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం. ఆయన్ను నమ్మితే మనకు మంచి జరుగుతుంది. వట్టిమాటలు చెప్పే ఎంతోమంది నాయకులను చూశాం. కానీ ప్రజలకు గట్టిమేలు చేస్తున్న సీఎం జగనన్న మాటల మనిషి కాదు. చేతల మనిషి. ప్రజానాయకుడు అని అభిప్రాయపడ్డారు.