"రిషికొండను దోచుకున్నట్లు.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా దోచుకునే కుట్రకు తెర లేపారు. సామాన్యుల నుంచి గృహిణిలకు కూడా అర్దం అయ్యే విధంగా ఈ అంశాలన్ని తీసుకెళ్లాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మరింత లోతుగా అందరికీ చెప్పడానికి రెండు రోజుల సమయం తీసుకుని పూర్తిగా పరిశీలిస్తాను. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్డు అనేది డ్రెకోనియన్ లా. న్యాయవాదులకు అర్దమైన విధంగా ప్రజలకు కూడా మనం చెప్పాల్సన అవసరం ఉంది. లీగల్ అవగాహన లేని వ్యక్తులకు సామాన్య పరిభాషలో అర్దం అయ్యేలా చెబుతాను. ఐదుగురు వ్యక్తులు కమిటీగా ఏర్పడితే ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తాను. ఆ తర్వాత పెద్ద సమావేశం పెట్టి అందరికీ వివరించేలా ముందుకు వెళదాం. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్దమైన చట్టం, ప్రాధమిక హక్కులను ఉల్లంఘించే చట్టం. మరోసారి అందరం కలిసి చర్చించుకుని.. కార్యాచరణ సిద్దం చేద్దాం. జనసేన పక్షాన న్యాయవాదుల ఆందోళనకు మద్దతు ఇస్తాను. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. దేశంలో ఉన్న ప్రతిపౌరుడు రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని అడ్డుకోవాలి. రాజకీయాలకు అతీతంగా.. ఏపీ ప్రజలకు హాని కలిగించే చట్టాన్ని బలంగా వివరించాలి. త్వరలో పెద్ద సభలా పెట్టి.. ప్రజల్లోకి వైసీపీ దుర్మార్గాన్ని తీసుకెళ్లాలి. న్యాయవాదుల దీక్ష శిబిరాలకు కూడా వచ్చినా వంతుగా మద్దతు ఇస్తాను." అని పవన్ కల్యాణ్ అన్నారు.