వైసీపీ చేపట్టినా సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ..... దేశ రాజకీయాల్లోనే జగనన్న అంటేనే ఓ సంచలనం. జగనన్న అంటేనే ఓ విప్లవం. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంను అంటాడు. ఈ ఆంధ్రరాష్ట్రంలో ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. మరి ఆయన సాధించింది ఏమిటో ఎవరికీ తెలియదు. బహుశా, ఆయనకు కూడా తెలియదేమో. మన పిల్లల్ని చదివించే బాధ్యత జగనన్న తీసుకున్నాడు. సంవత్సరానికి రూ.15 వేల రూపాయలు ఇస్తున్నాడు. మన పిల్లలు చదువుకుంటేనే వారికి భవిష్యత్తు బాగుంటుందని జగనన్న ఎంతో కృషి చేస్తున్నారు. మన పిల్లలు ఈరోజు బెంచీలమీద కూర్చుంటున్నారు. దర్జాగా యూనిఫాంలు, షూస్‌లు వేసుకుని, టైలు కట్టుకుని..ఇంగ్లీషు మీడియం చదువులు చదువుతున్నారు. ధనవంతుల పిల్లలకు, పేదల పిల్లలకు తేడా లేకుండా చేసిన జగనన్నకు మనం ఎంతగా రుణపడిపోయామో అర్థం చేసుకోవాలి. ఇక పేదలకు ఎలాంటి జబ్బులు చేసినా, ఎంత పెద్దవైనా పాతిక లక్షల మేర వైద్యసాయం అందించేలా చేస్తున్నారు జగనన్న. ప్రతి ఒక్క ఇంటికీ నేరుగా డబ్బులు అందించడం ద్వారా ..రూ.2.46లక్షల కోట్ల రూపాయలు పేదలకు అందించారు జగనన్న. ఈరోజు బీదాబిక్కీకి ధైర్యమిచ్చి, తోడుగా నిలబడ్డాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa