వైఎస్సార్‌సీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నానని ట్విట్టర్ (ఎక్స్)లో వెల్లడించారు. కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.. భవిష్యత్ కార్యాచరణ గురించి సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. అయితే అంటి రాయుడికి టీడీపీ థ్యాంక్స్ చెప్పింది. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా.. అవును నిజమే.. వైఎస్సార్‌సపీపీని వీడుతున్నట్లు రాయుడు చేసిన ట్వీట్‌పై టీడీపీ స్పందించింది. 'అంబటి రాయుడికి టీడీపీ థాంక్స్.. జగన్ వంటి నేతతో కలసి పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు ధన్యవాదాలు.. మీకు భవిష్యత్‌లో మంచి జరగాలని కోరుకుంటున్నాము' అంటూ అంటూ అంబటిని ట్యాగ్ చేస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. అంబటి రాయుడికి టీడీపీ థ్యాంక్స్ అంటూ చేసిన ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైఎస్సార్‌సీపీలో చేరిన పది రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అంబటి రాయుడ్ని పార్టీలో చేర్చుకుని.. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాయుడు కూడా పార్టీలో చేరకముందు గుంటూరు జిల్లాలో పర్యటించారు.. డిసెంబర్ 28న పార్టీలో చేరారు.. కానీ ఇంతలోనే యూ టర్న్ తీసుకున్నారు.