అలస్కా ఎయిర్ లైన్స్‌కి చెందిన బోయింగ్ 737-8 మ్యాక్స్ విమానం గాల్లో ఉండగా డోర్ ఊడిపోయిన ఘటన పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పందించింది.
దేశవ్యాప్తంగా నడుస్తున్న బోయింగ్ 737-8 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లలోని ఎమర్జెన్సీ ఎగ్జిట్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో బోయింగ్ దర్యాప్తుకు సిద్ధమైంది. బోయింగ్ 737-8 మ్యాక్స్ గాల్లో 16 వేల అడుగుల ఎత్తులో డోర్ ఊడిపోయినా సేఫ్ గా ల్యాండ్ అయింది.