ఈ నెల 9, 10 వ తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ రేపల్లె పట్టణ మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు కేవీ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శనివారం రేపల్లెలో మహాసభల కరపత్రాలను జిల్లా అధ్యక్షుడు శివశంకర్ ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న సమస్యలు పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందని విద్యారంగంలోని మార్పులకు కార్యాచరణ రూపొందించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయని తెలిపారు.