ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఓ బాలిక బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. రెండేళ్ల క్రితం బాలికకు శస్త్రచికిత్స జరిగినా.. కణితిలో కొంత భాగం మెదడులోనే ఉండి తిరిగి పెరిగింది.
దీంతో వైద్యులు డాక్టర్ దీపక్ గుప్తా, ఢిల్లీ ఎయిమ్స్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ మిహిర్ పాండ్యా, వారి ఐదుగురు సహచరులు జనవరి 4న బాలిక స్పృహలో ఉండగానే.. పుర్రెకు 16 ఇంజక్షన్లు వేసి, 4 గంటల పాటు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.