పాకిస్తాన్‌కు చెందిన సీమా హైదర్ తన ప్రియుడు సచిన్ మీనా కోసం తన పిల్లలతో సహా భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆమె మాజీ భర్త గులాం హైదర్ తన యూట్యూబ్ చానల్ ద్వారా సీమ హైదర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘సీమా హైదర్ ఒక దొంగ.. నేరస్తురాలు.. నా ఆస్తి, ఇల్లు అమ్మేసి ఇండియా పారిపోయింది' అని ఆరోపించాడు. ఈ మేరకు గులాం తన భార్య సీమా హైదర్‌ను, పిల్లలను పాక్ కు పంపాలని తన చానల్ ద్వారా భారత ప్రభుత్వాన్ని కోరాడు.