గుంతకల్లు పట్టణంలోని సత్యనారాయణ పేటలోని వాల్మీకి నగర్లో నివాసము ఉంటున్న ఆదిలక్ష్మి (24)అను వివాహిత సోమవారం ఇంటిలో పైకప్పుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భర్త రాజు వివరాలు మేరకు కర్నాటక రాష్ట్రం కమ్మరచేడు కు చెందిన ఆదిలక్ష్మికి రాజుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పిల్లలు పుట్టలేదని బంధువులు, చుట్టుపక్కల వారు మాట్లాడుతూ ఉండేవారు. దీంతో ఆమె మనస్థాపం చెంది ఉరేసుకునట్లు తెలిపారు.