అంగన్వాడీలు వర్షంలోనే గొడుగులతో నిరసన తెలిపారు. అంగన్వాడి కార్యకర్తలు సహాయకులు చేపట్టిన 28వ రోజు సమ్మెలో భాగంగా సోమవారం కలకడ మండల తహశీల్దారు కార్యాలయం ముందు తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ ధర్నా చేశారు. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమం ఆపేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఎస్మా ప్రయోగించినా భయపడేదిలేదన్నారు. కార్యక్రమంలో అంగన్వాడిలు, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.