మళ్లీ పెట్రోల్ బంక్ లు బంద్ చేస్తున్నారన్న వదంతులు వ్యాపించడంతో వాహనదారులు బంకులకు క్యూ కట్టారు. దీంతో బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ వదంతులేనని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బల్ మల్కిత్ సింగ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఎలాంటి డ్రైవర్ల సమ్మె లేదని, వదంతులు నమ్మవద్దని కోరారు. దీంతో పెట్రోల్ యథావిధిగా సరఫరా కానుంది.