ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామీపై తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ బేగంపేట్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంపై స్పందించారు. వైఎస్సార్ మరణంపై ప్రజలకు సందేహాలు ఉన్నాయని అన్నారు.
ప్రజలందిరిపై కేసులు పెట్టగలరా అని ప్రశ్నించారు. కాగా వైఎస్ మరణానికి కాంగ్రెస్, సోనియా గాంధీనే కారణమని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.