రాయలసీమ ప్రాంతంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళవారం మాజీ సీఎం వైఎస్ చంద్రబాబు పర్యటించనున్నారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
చంద్రబాబు ప్రోగ్రాంకు ఏవి సుబ్బారెడ్డిని రానివ్వకూడదనే యోచనలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఉన్నట్లు తెలిసింది. మరోవైపు జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు కూడా చంద్రబాబు పర్యటనకు ఆహ్వానం అందలేదట. దీంతో చంద్రబాబు పర్యటనలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని టెన్షన్ నెలకొంది.