రాష్ట్రంలో ప్రజల సంక్షేమ పథకాలు అందాలంటే మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత మన అందరిపై ఉందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. సోమవారం మక్కువ మండల కేంద్రమైన మక్కువ గొల్లవీధి తదితర ప్రాంతాల్లో మండల వైసీపీ నాయకులు మావుడి శ్రీనివాసరావు, మావుడి రంగునాయుడు ల ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను వివరించారు.