ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి ఎస్సీ కాదని, ఈ విషయమై విచారణ జరపాలని.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పి.ఇమ్మాన్యుయేల్.. జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ అందజేశారు. మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన మంత్రి సురేష్ తల్లిదండ్రులు ఆదిమూలపు జార్జి, థెరీసమ్మ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారని గుర్తు చేశారు. ఆ తర్వాత బీసీ(సీ)లుగా.. క్రిస్టియన్ కోటాలో 1984లో కర్నూలులో శ్రీరాయలసీమ క్రిస్టియన్ మైనారిటీ కళాశాల ఏర్పాటుకు అనుమతి పొందారని.. జార్జి అప్పట్లో ప్రధానోపాధ్యాయుడు కావడంతో టీసీలో తన కుమారులను ఎస్సీలుగానే పేర్కొని ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపించారు ఇమ్మాన్యుయేల్. కానీ వారు బీసీ(సీ) కిందకు వస్తార’ని అందులో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ ఆరోపణలపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించాల్సి ఉంది.