శ్రమకు తగిన జీతాలు చెల్లించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎర్రగొండపాలెంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమం 29వ రోజుకు చేరింది.మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తల శిబిరానికి చేరుకొని వారికి మద్దతు తెలిపి 12 వేల రూపాయలు ఖర్చులకు అందజేశారు.సీఐటీయూ నాయకులు కార్యకర్తలు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.