తెలంగాణలో కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి జగన్ పై కేసు నమోదు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఈశ్వరయ్య అన్నారు. మంగళవారం రాయచోటిలో అంగన్వాడీలకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నందుకు గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథ నాయక్ పై కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. అతనితో పాటు పదిమంది పై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఈశ్వరయ్య కోరారు.