వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్-2024ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కార్యక్రమానికి హాజరయ్యారు.
గ్లోబల్గా వివిధ దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీ సీఈవోలతో భారత్లోని వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందులో 50 శాతం మేర ‘గ్రీన్ ఎంఓయూ’లు కుదరనున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు.