కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మికులకు బుధవారం సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన, ప్రజా సమస్యలు మీద దృష్టి పెట్టకుండా ఎన్నికలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. ఈకార్యక్రమంలో శ్రీరామ్మూర్తి, టి. తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.