వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ... అణగారిన జాతుల కోసం.. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల కోసం.. వారి మంచి కోసం కష్టపడుతున్న నాయకుడు జగనన్న. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ..జగనన్న ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలని ఎంతగానో తపిస్తున్నారు. పేదపిల్లలు పెద్ద చదువులు చదివితే..వారి కుటుంబాల తలరాత మారిపోతుందని జగనన్న గట్టిగా నమ్ముతున్నారు. ఆ దిశలో బడి చదువుల్లో ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారత అంటే ఏంటో చేసి చూపారు జగనన్న. జగనన్న సంక్షేపపథకాలు, ఆర్థిక సాయం వల్ల రాష్ట్రంలో గతంలో 12శాతం పేదరికం ఉండగా..ఇప్పుడు 4శాతానికి పడిపోయింది. పేదరికం రేటు విషయంలో ఇంత గణనీయ మార్పు రావడంపై ఆర్థికవేత్తలు సైతం ప్రశంసిస్తున్నారు.