వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ..... జగనన్న అధికారంలోకి వస్తే మళ్లీ మళ్లీ బడుగు,బలహీనవర్గాలకు పదవులు వస్తాయి. సంక్షేమ పథకాలు ఆగకుండా వస్తాయి.పేదలకు బతుకు భరోసా ఉంటుంది. వారి పిల్లల చదువులు భారం కావు. అలాగే అనారోగ్యం పాలైన భయపడాల్సిన పనిలేదు. దిక్కుతోచని పరిస్థితిలో పడనక్కర్లేదు. పేదలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ జగనన్న పెద్ద అండగా ఉంటున్నారు. నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు.