‘మై పార్టీ డ్యాష్‌బోర్డ్ డాట్‌కామ్’ పేరుతో చంద్రబాబు మాల్‌ప్రాక్టీస్ చేస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి మండిపడ్డారు. టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైయస్ఆర్సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిపై ఈసీకి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఆయన ఫిర్యాదు చేశారు. గుర్తింపు లేని జనసేనకి కామన్ సింబల్ ఇవ్వొద్దని అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేన గుర్తింపులేని పార్టీ.. గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. చట్ట ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.