అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు గత కొన్ని రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తుంటే అవినీతి వైసిపి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని కళ్యాణదుర్గం టిడిపి ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు మండిపడ్డారు. గురువారం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో మండల రెవిన్యూ కార్యాలయం ఎదుట రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఉమామహేశ్వరనాయుడు, టిడిపి నాయకులతో కలిసి వెళ్ళి సంఘీభావం తెలిపారు.