నిజమైన ప్రేమను సమర్దిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఓ యువకుడు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసినట్లు 2015లో నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. యువతీ యువకులు ప్రేమించుకుని,
పెళ్లి చేసుకుని చట్టబద్ధంగా జీవిస్తున్నపుడు, వారు పెళ్లి చేసుకునే సమయానికి వారిలో ఒకరు లేదా ఇద్దరూ మైనర్లు అయినా, మేజర్ అయ్యే వయసుకు సమీపంలో ఉన్నా, వారి నిజమైన ప్రేమను అధికారంతో నియంత్రించలేం అని తెలిపింది.