గోదావరి జిల్లాల్లో కోడిపందాల హడావిడి మొదలైంది. సంక్రాంతి పండుగకు దాదాపు రూ.200 కోట్ల పైగా చేతులు మారుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పందాల్లో దిగే కోడి పుంజులకు భారీ డిమాండ్ ఉంది.
పందెంలో తమ కోడి నిలవాలి.. గెలవాలి అనుకునేవారు.. ఏరికోరి కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. దీంతో వ్యాపారులు పెద్ద ఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు. కోడి పుంజుల అమ్మకాల రూపంలోనే ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది.