అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి క్వారీలపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లు సమీపంలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్ అధికారులు క్వారీల్లో తనిఖీలు చేపట్టారు. నేమకల్లు క్వారీ వద్ద ముడి సరుకు రవాణా లారీలు నిలిచిపోయాయి. కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతో ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి అని అయన అనుచరులు వాపోతున్నారు. జీఎస్టీ చెల్లించకుండా చేస్తున్న మైనింగ్‌ను నిలిపివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.