రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్, టెక్కలి పార్లమెంట్ వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నందిగాం మండలం రథజన బొడ్డపాడు పంచాయితీలో 500ల గిరిజన కుటుంబాలకు పేరాడ తిలక్ దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న పేరాడ తిలక్ సేవలను అధిష్టానం గుర్తించింది. బీసీ వర్గాలకు చెందిన తిలక్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. యువకుడు, పట్టభద్రుడైన పేరాడ తిలక్‌ను పార్లమెంట్ ఇన్చార్జిగా పార్టీ అదిష్టానం నియమించింది. గత ఎన్నికల్లో ఆయన టెక్కలి అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ తర్వాత కార్పొరేషన్ పదవిని అధిష్టానం అందించింది. ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించింది. ఇప్పుడు ఆ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.