సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ శుక్రవారం పేర్కొన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ ఆటలు ముద్దు అని ఎస్పీ సూచించారు. జూద వ్యసనం ప్రజల జీవితాలను నాశనం చేస్తుందని అన్నారు.