ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన పాఠశాలలోని తరగతి గదిలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని కనిపించాడు. జిల్లాలోని అన్లగుంజ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీనేజ్ కుర్రాడు హాస్టల్ లో ఉండేవాడు. మృతుడిని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న బిశ్వభూషణ్ నందా (15)గా గుర్తించినట్లు బంగ్రిపోషి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి తెలిపారు. ఈ ఉదయం మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa