రైలు చార్జీల్లో వృద్ధులు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరించాలన్న డిమాండ్‌పై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. రైల్వే ప్రయాణాల చార్జీల్లో ప్రయాణికులకు ఇప్పటికే 55 శాతం రాయితీ అమలవుతోందని తెలిపారు.
కొవిడ్ సంక్షోభానికి ముందున్న విధంగా సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రాయితీ పునరుద్ధరణపై గురువారం అహ్మదాబాద్‌లో జర్నలిస్టులు మంత్రిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాత్రం మంత్రి సమాధానం దాటవేశారు.