సంక్రాంతి పండగను పురస్కరించుకొని పిఠాపురం నియోజకవర్గంలో కోడి పందాలు, జూద క్రీడలు నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం పోలీసులు గ్రామాల్లో మైక్ లతో ప్రచారం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలతో పండగలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.