అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రారంభం కానుంది. దేశ విదేశాల్లో రామ భక్తులు సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కి చెందిన సరస్వతీ దేవి అనే 85 ఏళ్ల వృద్ధురాలు అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజునే తిరిగి మాట్లాడతాను అంటూ ప్రతిజ్ఞ చేసి 32 ఏళ్లుగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఆమె మౌన వ్రతం జనవరి 22న రామ మందిర ప్రతిష్ఠాపనతో ముగియనుంది.